అన్యాయాన్ని ప్రశ్నిస్తే అణచివేస్తారా.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- అన్యాయాన్ని ప్రశ్నిస్తే అణచివేస్తారా.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ - September 26, 2026
- వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ - September 26, 2026
- ముదిరాజ్ గణేష్ మండపంలో.. ఆత్మీయ కలయిక యూత్ మహా అన్నదానం - September 26, 2026

వంగూర్: ప్రజా సమస్యలపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి,బీఆర్ఎస్ నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి జాజాల గ్రామంలో పర్యటించారు.గ్రామ సర్పంచ్ కాశమ్మని కలిసి స్థానికంగా ఎదురవుతున్న సమస్యలు,అధికారుల వేధింపులపై ఆరా తీశారు.గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్, ఇసుక దందా, భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ముఖ్యంగా దుందుబి వాగు పరిధిలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై విచారించారు.దీనిపై ప్రశ్నిస్తే అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదని స్థానికులు వారికి వివరించారు.ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ..అన్యాయాన్ని ప్రశ్నిస్తే అణిచివేస్తారా స్పీకర్ కు ఒక న్యాయం.. జాజాల సర్పంచ్ కాశమ్మకు మరో న్యాయమా?కాంట్రాక్టు అడిగిత గెస్ట్‌హౌస్‌కు రమ్మంటారా అని ప్రశ్నించారు.ఇదేనా ప్రజా పాలన.. ఇందిరమ్మ పాలన అని నిలదీశారు.అలాగే విద్యుత్ సరఫరాపై కూడా విమర్శలు చేశారు.కొండారెడ్డిపల్లికి 24 గంటల కరెంట్ ఇస్తూ, చుట్టుపక్కల గ్రామాల్లో కోతలు విధించడం ఏంటని ప్రశ్నించారు.ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తామని, ప్రజల తరఫున పోరాడుతామని ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
