ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం.. ఘనంగా 131 వ జయంతి వేడుకలు
- అన్యాయాన్ని ప్రశ్నిస్తే అణచివేస్తారా.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ - September 26, 2026
- వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ - September 26, 2026
- ముదిరాజ్ గణేష్ మండపంలో.. ఆత్మీయ కలయిక యూత్ మహా అన్నదానం - September 26, 2026

వెల్దండ, సెప్టెంబర్ 26: వెల్దండ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రజక సంఘం అధ్యక్షుడు రేవల్లి రవి, ఉపాధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీను ముదిరాజ్ తదితరులు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు జోగయ్య, చిందెం కృష్ణయ్య, టి.చెన్నయ్య (రిటైర్డ్ టీచర్), జంగయ్య, అంజి, వార్డు సభ్యులు పురుషోత్తం చారి, ముదిగొండ రమేష్, మసిగుండ్ల వెంకటేష్‌తో పాటు రజక సంఘం సభ్యులు బిక్షపతి, మస్తాన్, సత్యనారాయణ, రేవల్లి శ్రీను, రేవల్లి రాజు, బాలరాజు, దర్గయ్య, మల్లేష్, రవి, శ్రీను, సురేష్, బాలస్వామి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
