మానవత్వం చాటుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్
వెల్దండ సెప్టెంబర్ 16 : వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ హుటాహుటిన మృతుని నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అంతటితో ఆగకుండా మానవతా హృదయంతో మృతుని కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను, వార్డు…
