ఆమనగల్లులో శివసేన గణనాథుడిని దర్శించుకున్న బీజేపీ నేత తల్లోజు ఆచారి
- ఆమనగల్లులో శివసేన గణనాథుడిని దర్శించుకున్న బీజేపీ నేత తల్లోజు ఆచారి - September 26, 2026
- పుల్జాలకు పట్టిన బస్సు కష్టాలు తీరినట్టే.. ఎమ్మెల్యే చొరవతో నూతన బస్సు సర్వీసు ప్రారంభం - September 26, 2026
- నాగర్ కర్నూల్ మండలం పుల్జాల గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ – పాల్గొన్న ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి - September 26, 2026
ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలో శివసేన ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాన్ని బీజేపీ సీనియర్ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామి వారిని వేడుకున్నారు.
అనంతరం అక్కడ నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ నేనావత్ పత్యా నాయక్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, శివసేన నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డించి, ఉత్సవ కమిటీ నిర్వాహకులను ఆచారి గారు అభినందించారు.
