Daily Archive: September 23, 2026

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిగురింత పారిజాతకు ఎమ్మెల్యే కసిరెడ్డి అభినందనలు

ఇటీవల రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్రీమతి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, కల్వకుర్తి గౌరవ ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ భేటీలో, నూతన జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన పారిజాత నర్సింహారెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు అభినందనలు తెలిపారు….

బాలుడు అదృశ్యం – ఆందోళనలో తల్లి దండ్రులు

బాలుడు ఆచూకీ కోసం విజ్ఞప్తి వెల్దండ : ఆర్యన్ కుమార్ అనే బాలుడు మంగళవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో తప్పిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ బాలుడు కొట్ర తండా సమీపంలో తల్లిదండ్రులతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.బాలుడి తండ్రి పేరు గౌతమ్ సింగ్, తల్లి సావిత్రి దేవి.బాలుడి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.ఆచూకీ తెలిసిన వారు వెంటనే ఈ నంబర్లకు సమాచారం ఇవ్వగలరు: గిరీష్ (బాలుడి సంబంధీకులు):…

అమ్మపల్లి – మారేపల్లి బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

తిమ్మాజిపేట మండలంలోని అమ్మపల్లి గ్రామం నుండి మారేపల్లి కమాన్ వరకు 3.5 కిలోమీటర్ల మేర రూ. 3 కోట్ల 80 లక్షల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.సోమవారం రాత్రి జేసీబీతో పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తైతే అమ్మపల్లి, మారేపల్లి గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి రెడ్డి, జిల్లా…

గణనాథుని ఆశిస్సులు ప్రజలందరి పై ఉండాలి.. టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి

ఆమనగల్: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవచైతన్య కాలనీలోని పలు గణేష్ ఉత్సవ కమిటీలతో పాటు శివసేన యూత్, శ్రీ రామాంజనేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు….

మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి గూడెం పెద్ద వేపచెట్టు వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని రేషన్ డీలర్ దుద్దుల పరుశరాములు–పద్మ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు యువసేన యూత్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదానానికి సహకరించిన దుద్దుల పరుశరాములు–పద్మ దంపతులను కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందించడం ఆనందంగా…

వంగూర్ మండల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ

వంగూర్ మండల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు.నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం (ఐకేపీ బిల్డింగ్)లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు…