Daily Archive: September 19, 2026

వెల్దండకు వెలుగులు – 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సర్పంచ్

వెల్దండ, సెప్టెంబర్ 19: వెల్దండ మండల కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను శనివారం సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గి స్థానికులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను ముదిరాజ్, విద్యుత్…

కల్వకుర్తిలో విషాద ఘటన వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు బలి

కల్వకుర్తి, సెప్టెంబర్ 19: వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన విషాద ఘటన కల్వకుర్తి పట్టణ కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామానికి చెందిన జంపుల అరవింద్ (26) బీజేవైఎం మండల జనరల్ సెక్రెటరీ వినాయక మండపం వద్ద అలంకరణ కోసం ఏర్పాటు చేసిన కాషాయ తోరణాలపై వర్షం కారణంగా పడిన విద్యుత్ తీగలను తొలగించే ప్రయత్నం చేశాడు….

జిఎంఆర్ కాలనీ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి

ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం కట్కూరు భజన మండలి వారిచే భక్తి భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది.ఈ భక్తి కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.

చౌడర్‌గూడలో TOSS ప్రవేశాల ప్రచారం

చౌడర్‌గూడ, సెప్టెంబర్‌ 19: చదువును మధ్యలో నిలిపివేసిన విద్యార్థులు, ఉద్యోగులు, విద్యను తిరిగి కొనసాగించాలనుకునే వారికి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (TOSS) ద్వారా మంచి అవకాశం లభిస్తోందని అధికారులు తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబర్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. చౌడర్‌గూడ జెడ్‌పీహెచ్‌ఎస్‌లో TOSS ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్‌ను GHM కే. సునీత ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం నీలా మోహన్‌ నాయక్, ఇన్‌స్ట్రక్టర్‌ కుశాల్‌ జామాతో…

హెచ్‌-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి/వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 19: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా విధానంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025లో విధించిన 1 లక్ష డాలర్ల చెల్లింపు నిబంధనను కొన్ని హెచ్‌-1బీ దరఖాస్తులకు మరో 12 నెలల పాటు కొనసాగిస్తూ సెప్టెంబర్‌ 18న ప్రకటన...

ఎర్రగుట్టలో విషాదం.. గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతి

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి/జడ్చర్ల, సెప్టెంబర్ 19: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఎర్రగుట్ట ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నిర్మాణ పనుల కోసం ఇంటి సమీపంలో గుంత తవ్వి ఉంచారు....

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి/శంషాబాద్, సెప్టెంబర్ 19:శంషాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స...

రంజిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రాజేందర్ రెడ్డి

ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి కి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ మాజీ డిప్యూటీ మేయర్ పులిపాటి రాజేందర్ రెడ్డి నేతృత్వంలో పలువురు ముఖ్య నాయకులు

కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అన్నాదానం :

వెల్దండ: వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరికిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఘనపయ్యకు పూజలు చేసిన వార్డు సభ్యులు మసిగుoడ్ల వెంకటేష్ , సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య .అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షులు ఎన్నo భూపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్ , వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ,కిషన్ సెల్ తాలూకా అధ్యక్షులు పర్వ…

బాలల బంగారు భవిష్యత్తుకు పోషకాహారమే పునాది – వెల్దండలో సమన్వయ సమావేశం

వెల్దండ సెప్టెంబర్ 18: కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోని వెల్దండ మండలంలో తొమ్మిదో పోషణ మాసం కార్యక్రమాలపై మండల స్థాయి కన్వర్జెన్స్ సమావేశం శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా పోషణ మాసం కార్యక్రమాల నిర్వహణ,ప్రజల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడం,అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులు సమగ్రంగా చర్చించారు.గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం, సమతుల్య ఆహారం,ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పోషణ మాసం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.సమావేశంలో…