Daily Archive: September 14, 2026

రేవంత్ రెడ్డి ఖాతాలో మరో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బలి?

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్‌ను మార్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉన్నత చదువుల కోసం ఆమె 10 నెలల పాటు విదేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో దీపాదాస్ మున్షీపై ఆరోపణలు చేయించి ఆమెను ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించేలా రేవంత్ రెడ్డి వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఆయన ఏకపక్ష ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు గత ఏడాది ఫిబ్రవరిలో మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ ఇన్‌చార్జ్‌గా…

ఎంపీ ఆర్ కృష్ణయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంజనేయులు గౌడ్

వెల్దండ సెప్టెంబర్ 13: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.ఆర్. కృష్ణన్నను వెల్దండ మండలంలోని బొల్లంపల్లి వాస్తవ్యులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ సత్తురి ఆంజనేయులు గౌడ్ కలిసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 50 ఏళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగుల కోసం పోరాడుతున్న కృష్ణన్న సేవలు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆయురారోగ్యాలతో మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే సహకారంతో బొల్లంపల్లిలో విద్యుత్ ప్రమాద ముప్పు తొలగింపు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 13: వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో గృహాలపై ఉన్న విద్యుత్ తీగల వల్ల ఏళ్లుగా ప్రజలు ప్రమాద భయంతో ఉండేవారు.కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి, గృహాలపై ఉన్న ప్రమాదకర విద్యుత్ తీగలన్నింటినీ తొలగించి,దారి మళ్లించారు. దీంతో ప్రజలకు విద్యుత్ ప్రమాద ముప్పు తప్పినట్లయింది.సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,సర్పంచ్ ప్రసాద్ గౌడ్…

సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం – మార్కెట్ డైరెక్టర్ రాజశేఖర్

వెల్దండ 13: పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ పథకం పెద్ద అండగా ఉందని కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్కు రాజశేఖర్ అన్నారు.వెల్దండ మండలం చెర్కూర్ గ్రామానికి చెందిన బొల్లంపల్లి మౌనికకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 21 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమె కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేదలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తోందని తెలిపారు.అలాగే చెర్కూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన దాసరి బాలయ్య కుటుంబాన్ని…

ఆర్య వైశ్యులకు అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు – బచ్చు రామకృష్ణ

వెల్దండ : పేద ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బచ్చు రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేద ఆర్యవైశ్యులకు కొండంత అండగా ప్రజా ప్రభుత్వం నిలబడిందన్నారు. ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని కోరారు. ఆర్యవైశ్యులు…

నిరుపేద విద్యార్థులకు పట్టుదలే పునాది – సర్పంచ్ మహిపాల్ నాయక్

వెల్దండ మండలం,నాగర్ కర్నూల్ జిల్లా నిరుపేద విద్యార్థుల పట్టుదలే వారి భవిష్యత్తుకు పునాది వేస్తుందని సర్పంచ్ మహిపాల్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థుల పట్టుదల గురించి,విద్య గురించి సర్పంచ్ మహిపాల్ నాయక్ మాట్లాడుతూ..పేదరికం చదువుకు అడ్డు కాకూడదు. జైరాం నాయక్ కుమార్తె గంగోత్రి లాంటి విద్యార్థులు ఎంతో పట్టుదలతో చదువుతున్నారు. వారికి మనం అండగా నిలబడాలి. ఈ ల్యాప్‌టాప్ ఆమె ఉన్నత చదువులకు, పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.గ్రామంలో ప్రతి విద్యార్థి బాగా చదివి గ్రామానికి,…