నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి
- పెళ్లయిన తెల్లారే ప్రసవం.. వరుడికి ఊహించని షాక్! - November 22, 2026
- వ్యవసాయ వర్సిటీలో 566 అధ్యాపక పోస్టులకు గ్రీన్‌సిగ్నల్! - November 21, 2026
- తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్! - November 21, 2026

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,అక్టోబర్ 09:
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో వ్యవసాయ పొలంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పనమోని శివ, పూజిత దంపతులు తమ రెండేళ్ల కుమారుడు కౌశిక్‌తో కలిసి పత్తి తీసేందుకు వ్యవసాయ పొలానికి వెళ్లారు. అక్కడ బాలుడు ఆడుకుంటూ కొంతదూరం వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు వెతకగా, పొలంలోని నీటి గుంతలో బాలుడు విగతజీవిగా కనిపించాడు. అప్పటికే బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
