చీమలదరి లో ఉచిత వైద్య శిబిరం
- చీమలదరి లో ఉచిత వైద్య శిబిరం - October 12, 2026
- బతుకమ్మలతో పాఠశాలల విద్యార్థినులు - October 9, 2026
- వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు తగిన సూచనలు - October 7, 2026
మోమిన్ పేట్ మండలం చీమలదరి గ్రామంలో అపోలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారు జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీమలదరి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో సాధారణ వ్యాధుల వైద్య సేవలు మరియు సాధారణ శస్త్ర చికిత్సల వైద్యులు , ఎముకల వ్యాధుల వైద్యులు, మరియు కంటి వ్యాధుల వైద్యులు పాల్గొనడం జరిగింది ఈ క్యాంపులో 350 మందికి పైగా గ్రామస్తులు పాల్గొనడం జరిగింది ఇట్టి క్యాంపులో ఉచితంగా బిపి షుగర్ వైద్య పరీక్షలు ఉచితంగా చేయడం తో మరియు మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం వల్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు .

