ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ చేయించుకోవాలి

మోమిన్ పేట్ మండల పరిధిలో బాల్ రెడ్డి గూడ గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది. బ్యాంక్ సిబ్బంది మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ చేయించుకోవాలి. ఋణాలు తీసుకున్న రైతులు , డ్వాక్రా సంఘాలు సకాలంలో తిరిగి చెల్లించాలని సూచించారు . నేటి ఆధునిక మరియు అనిశ్చిత జీవితంలో ప్రతి ఒక్కరూ బీమా పాలసీ చేయించుకోవడం అత్యంత ఆవశ్యకం. జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు కుటుంబం రోడ్డున పడకుండా కాపాడే ఒకే ఒక రక్షణ కవచం బీమాపథకం. ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ లో భాగస్వాములు కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, గ్రామ సర్పంచ్,గ్రామస్తులు, మహిళ సంఘాలు పాల్గొన్నారు.

You may also like...