రైతులకు చివరి అవకాశం.. వెంటనే రైతు నమోదు చేసుకోండి!

జ్ఞానతెలంగాణ, సంగారెడ్డి, కొండాపూర్: 1435337.jpg

రైతులు ఎలాంటి ఆలస్యం చేయకుండా రైతు నమోదు ప్రక్రియను తప్పనిసరిగా త్వరగా పూర్తి చేసుకోవాలని కొండాపూర్ వ్యవసాయ విస్తరణ అధికారి ప్రేమ్ రాజ్ సూచించారు. రైతు నమోదు గడువు ముగింపు సమయం సమీపిస్తున్నందున ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు వెంటనే సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి నమోదు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు రైతు నమోదు కీలకమని ప్రేమ్ రాజ్ తెలిపారు. గడువు ముగిసేలోపు ప్రతి రైతు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతు నమోదుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 6305924105 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని వ్యవసాయ విస్తరణ అధికారి ప్రేమ్ రాజ్ తెలిపారు.

You may also like...