రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) న్యాల్కల్ మండలం చాల్కి గ్రామ సర్పంచ్ అశోక్ ఇటీవల గుండెపోటుకు గురై కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణంలో గల గుడగె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఆసుపత్రికి వెళ్లి అశోక్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అశోక్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అశోక్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి చైర్మన్‌తో పాటు వైద్యులకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి, మారుతి, శ్రీపాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.