ప్రభుత్వ లీడర్ నక్క బొజ్జయ్యకు ఘన సన్మానం
- ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామాకు ఢిల్లీలో ధర్నా.. పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి - October 13, 2026
- గాయత్రి దేవి అవతారంలో అమ్మవారు దర్శనం – భక్తులతో కిటకిటలాడిన దుర్గాదేవి మండపాలు - October 13, 2026
- రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఎమ్మెల్యే కసిరెడ్డి - October 13, 2026
కల్వకుర్తి :హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులైన శ్రీ నక్క బోజ్జయ్య (గణేష్)ను కొమ్మగోని శ్రీనివాస్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఆయన కార్యాలయ ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శాలువా కప్పి సత్కరించడంతో పాటు జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా నక్క బోజ్జయ్యకు లభించిన న్యాయ నియామకం, వృత్తిపరమైన పురోగతిని అభినందించారు. ప్రభుత్వ ప్లీడర్‌గా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల తరఫున సివిల్ వివాదాలు, దావాలు, ఇతర న్యాయపరమైన వ్యవహారాల్లో కోర్టులో సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు.ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ, న్యాయ సేవలను సమర్థవంతంగా కొనసాగించాలని కొమ్మగోని శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.
