నాలుగేళ్ల తర్వాత న్యాయమే గెలిచింది
- నాలుగేళ్ల తర్వాత న్యాయమే గెలిచింది - November 6, 2026
- సొంత నిధులతో 30 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ - October 26, 2026
- రైతులకు చివరి అవకాశం.. వెంటనే రైతు నమోదు చేసుకోండి! - October 12, 2026

నాలుగేళ్ల తర్వాత న్యాయమే గెలిచింది!
దాడి కేసులో నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష
కొండాపూర్: మునిదేవునిపల్లి గ్రామానికి చెందిన మాల అంజయ్యపై 2021లో కర్రతో దాడి చేసిన కేసులో పడమటి అశోక్‌రెడ్డికి న్యాయస్థానం ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది.
అంజయ్యపై దాడి ఘటనకు సంబంధించి కొండాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నేర సంఖ్య 12/2021 కింద కేసు నమోదైంది. నాలుగేళ్లపాటు కొనసాగిన విచారణ అనంతరం న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది.
చివరకు న్యాయమే గెలిచిందని ఎస్సై సోమేశ్వరి తెలిపారు.
