రాజేంద్రనగర్‌లో మాజీ రౌడీషీటర్ దారుణ హత్య

432645.jpg

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో పాత కక్షల నేపథ్యంలో మాజీ రౌడీషీటర్ మూర్తుజా అలీ (పైల్వాన్) దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు కత్తులు, తల్వార్లతో ఆయన మెడ, ముఖంపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మూర్తుజాను అత్తాపూర్‌లోని జర్మన్‌టెన్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనుచరులు భారీగా చేరుకోవడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like...