చిక్సిత పొందుతూ లైన్ మెన్ మృతి

చిక్సిత పొందుతూ లైన్ మెన్ మృతి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 12 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యుత్ లైన్ మెన్ ముక్కాముల వెంకన్న చికిత్స పొందుతూ మృతిచెందాడు. సెప్టెంబర్ 25న ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి తిరిగి కట్టంగూర్ వస్తుండగా మాణిక్యాలమ్మగూడెం క్రాస్ రోడ్డు వద్ద హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ్మ, గార్లపాటి రవీందర్ రెడ్డి పాటు వివిధ పార్టీ నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.1000375589.jpg

You may also like...