ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం
- పోలీసు దుస్తుల వెనుక ఒక బాధ్యతగల అధికారి ఉంటారు… - October 19, 2026
- సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి భూమి పూజ - October 19, 2026
- కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు - October 19, 2026
ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 16 :మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం దుర్గాదేవి ఆలయం లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రామడుగు శ్రీనివాస శర్మ,రామడుగు అశ్విన్ శర్మల ఆధ్వర్యంలో మహిళలతో సామూహికంగా అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో మిట్టపల్లి శివ స్వాతి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు ఐదవ వార్డు సభ్యురాలు శ్రీరామ్ సంధ్య, బండారు అరుణ్, కాపుగంటి గోపి, కోమటి భాస్కర్, కొల్లూరు శివ ప్రసాద్, ఇల్లెందుల మణెమ్మ, కొంపెల్లి మంగమ్మ,దోరేపల్లి పద్మ, ఇల్లెందుల సంధ్య,గుండు రూప, బండారు నాగమ్మ, వోరుగంటి ఉష, కొంపెల్లి సుజాత తదితరులున్నారు.
