పెద్దమ్మతల్లి యాదవ గుడి నిర్మాణానికి సర్పంచ్ రూ.1.50 లక్షల విరాళం

వెల్దండ అక్టోబర్ 29 : నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి యాదవ గుడి స్లాబ్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కేశమల్ల అనూష కృష్ణ రూ.1,50,116 ఆర్థిక సాయం అందించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తన వంతు సహాయంగా ఈ మొత్తాన్ని అందజేశారు.గ్రామంలో ఎవరైనా కులదైవాల ఆలయాల నిర్మాణం చేపడితే తన వంతు ఆర్థిక సహాయం అందిస్తానని సర్పంచ్ అనూష కృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదవ కుల పెద్దలు, యాదవ కమిటీ అధ్యక్షుడు కాగుల సాయి, ఉపాధ్యక్షుడు మెండే శివ, వార్డు సభ్యులు తిరుపతి నాయక్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.1001310476.jpg

You may also like...