ఆలయ నిర్మాణానికి భక్తుల విరాళాల వెల్లువ..రూ.3.52 లక్షలకు పైగా విరాళాలు

1001262537.jpg

వెల్దండ అక్టోబర్ 14: వెల్దండ మండలంలోని చెరుకూరు గ్రామంలో నిర్మిస్తున్న శ్రీశ్రీ శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణానికి భక్తులు విరాళాలు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.ఆలయ నిర్మాణానికి పలువురు దాతలు ఉదారంగా విరాళాలు అందించారు.మండే గుత్తల విజయ్ కుమార్, భద్రప్ప, శివలింగం రూ.1,00,116 విరాళంగా అందించగా, యెడ్ల శృతి (మున్నీ), ఆమె భర్త యెడ్ల ప్రభాకర్ రెడ్డి రూ.50 వేలు సమర్పించారు. అదేవిధంగా కొండారెడ్డి పల్లికి చెందిన కోసిరెడ్డి విజయలక్ష్మి రూ.51,116, బుడ్డోన్‌పల్లికి చెందిన ముత్యాల అరుణమ్మ, ఆమె భర్త దయాకర్ రెడ్డి రూ.50,116 విరాళంగా అందించారు.దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు గ్రామస్థులు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులతో దాతలు, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

You may also like...