ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి మృతుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి మృతుడి కుటుంబానికి ఆర్థిక చేయూత


జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి ప్రతినిధి, ఆగస్టు 3:
కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన పేర గెల్వరాజు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ గోరటి శ్రీనివాసులు కూడా పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్రామ బీఆర్ఎస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ఉప్పల వెంకటేష్ మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి చేయూతనందించారు. కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు రుక్మాద్దీన్, తాళ్ల సురేష్ గౌడ్, వర్కల దేవయ్య, బొమ్మరోని చంద్రయ్య, గొడుగు భానుచందర్, వర్కల వెంకట్ రత్నం, పేరా కృష్ణ, నలింగి శివమణి, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...