రూ 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్

నాగర్‌కర్నూల్: అచ్చంపేట ఉప విభాగ ఖజానా కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కందాడ వెంకటయ్య రూ.25 వేల లంచం వ్యవహా1001240738.jpg

రంలో ఏసీబీకి పట్టుబడ్డారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. సెలవుల అనంతరం విధుల్లో చేరిన ఫిర్యాదుదారుడికి సెలవులు, రావాల్సిన బత్యాలకు సంబంధించిన బిల్లులు పూర్తి చేసేందుకు సీనియర్ అకౌంటెంట్ వెంకటయ్య రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా ఆగస్టు 14న రూ.2 వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించగా, ఆగస్టు 18న మిగిలిన రూ.23 వేలను ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టిన ఏసీబీ అధికారులు నిందితుడు కందాడ వెంకటయ్యను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే 9440446106 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.

You may also like...