పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి : తహసిల్దార్ కార్తీక్ కుమార్
- ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామాకు ఢిల్లీలో ధర్నా.. పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి - October 13, 2026
- గాయత్రి దేవి అవతారంలో అమ్మవారు దర్శనం – భక్తులతో కిటకిటలాడిన దుర్గాదేవి మండపాలు - October 13, 2026
- రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఎమ్మెల్యే కసిరెడ్డి - October 13, 2026

వెల్దండ: మండలంలోని డిగ్రీ ఉత్తీర్ణులైన యువతీ యువకులు ఎమ్మెల్సీ ఓటర్లుగా కొత్తగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ కార్తీక్ కుమార్ కోరారు. వెల్దండ మండలంలోని 32 గ్రామపంచాయతీల పరిధిలో ఇప్పటికే 780 మంది పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదై ఉన్నారని తెలిపారు.2023 అక్టోబర్ నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అర్హులైన యువతీ యువకులు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన విద్యార్హత పత్రాలను అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో లేదా మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారు నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తహసీల్దార్ కోరారు.
