క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ ముందంజ

కల్వకుర్తి:వెల్దండ మండలం చౌదర్‌పల్లి గ్రామంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీపీఎల్‌-7 క్రికెట్ పోటీలను ఫౌండేషన్ బోర్డు సభ్యుడు దొబ్బల భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ చేశారు.ఆర్ఎస్పీ ఫౌండేషన్ విద్య, వైద్య రంగాలతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించడంలోనూ ముందుంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా విద్యార్థులను, యువతను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ డైరెక్టర్ అశ్విన్ కుమార్, బోర్డు సభ్యులు బండగల్లు చందు, కొమ్ము కిరణ్ కుమార్, కొప్పు మహేష్, రాము శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1001268889.jpg

You may also like...