ఢిల్లీ సభకు తెలంగాణ నుంచి 15 వేల మందికి పైగా హాజరు.. ఎమ్మెల్యే కసిరెడ్డి

1001323031.jpg

వెల్దండ నవంబర్ 02: ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నిర్వహించిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ సభకు తెలంగాణ నుంచి 15 వేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలు హాజరైనట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం పనితీరులో పారదర్శకత, ఓటర్ల జాబితాల సవరణలో అవకతవకలకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సభ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక రైళ్లకు అనుమతి లభించకపోవడంతో బస్సులు, కార్లు, ఇతర వాహనాలు, విమానాల ద్వారా తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపారు.సభకు హాజరైన వారికి వసతి, భోజనం, వైద్య సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. ఓటు హక్కుల పరిరక్షణ అంశంపై కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాల్లో తెలంగాణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

You may also like...