విద్యుత్ కోతలపై చంద్రధన రైతుల నిరసన

తలకొండపల్లి,అక్టోబర్ 9: విద్యుత్ కోతలతో వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామ రైతులు సబ్‌స్టేషన్‌ వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. పురుగుమందు బాటిళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు.ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు, విద్యుత్ కోతలు మరింత నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్జాల్ సబ్‌స్టేషన్‌ నుంచి చంద్రధన సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ హామీని నిలబెట్టుకోవాలని, వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు శ్రీకాంత్ రెడ్డి, బండేలా రాజు రెడ్డి, గణేష్ యాదవ్, రాజు యాదవ్, కుమార్, శేఖర్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.1001247914.jpg

You may also like...