ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు టాస్క్ సిఓఓ రూ. లక్ష విరాళం
- యూత్ డిక్లరేషన్ ర్యాలీని జయప్రదం చేయండి.. గోలి - September 4, 2026
- ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు టాస్క్ సిఓఓ రూ. లక్ష విరాళం - September 4, 2026
- ప్రజా ప్రభుత్వం కాదు ” దగా ప్రభుత్వం” - September 4, 2026

చారకొండ మండలం,జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొడ్లపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఈధమ్మ తల్లి, మాంధాతల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కోసం రూ.1 లక్ష రూపాయలు చెక్కును విరాళంగాళం అందించారు.ఈ సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మికతను, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగిస్తానని తెలిపారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు సుంకిరెడ్డిని చాలువతో ఘరానా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్,ఉప సర్పంచ్ మధు,మాజీ ఉప సర్పంచ్ మాధవ రెడ్డి,వార్డు సబ్యులు నరేష్,బాష సీనియర్ నాయకులు సిరాజ్,ఫౌండేషన్ సభ్యులు కొండల్ యాదవ్,మరియు ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
