సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: పత్యా నాయక్

1001371545.jpg

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,నవంబర్ 17: అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని గానుగట్టు తండా మాజీ సర్పంచ్ పత్యా నాయక్ అన్నారు. వెల్దండ మండలం గానుగట్టు తండాకు చెందిన శంకర్ నాయక్‌కు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును సోమవారం ఆయన బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...