పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు – కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
- పేదల ప్లాట్లకు ముప్పు.. చెరువు భూముల కబ్జా? అక్రమాలపై తహసీల్దార్‌కు ఫిర్యాదు - November 28, 2026
- ఉర్దూ ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖలిక్ పదవీ విరమణ.. ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్ పర్సన్ - November 28, 2026
- కల్వకుర్తిలో ఘనంగా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు - November 28, 2026

నాగర్‌కర్నూల్,నవంబర్ 27: మహబూబ్‌నగర్ – రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా పునఃతయారీలో భాగంగా జిల్లాలో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు.నవంబర్ 28, 29 తేదీల్లో మొదటి విడతగా, డిసెంబర్ 5, 6 తేదీల్లో రెండో విడతగా జిల్లాలో గుర్తించిన ప్రతి పోలింగ్ కేంద్రంలో శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 01.11.2026ను అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకొని ఓటరు జాబితా రూపొందిస్తున్న నేపథ్యంలో పట్టభద్రులు ముసాయిదా జాబితాలో తమ పేర్లు, వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.జాబితాలో పేరు లేని అర్హులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వివరాల్లో మార్పులు లేదా అభ్యంతరాలు ఉంటే ఫారం-7, ఫారం-8 ద్వారా సమర్పించాలని తెలిపారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు డిసెంబర్ 10 చివరి తేదీగా పేర్కొన్నారు. ప్రత్యేక శిబిరాలతో పాటు సాధారణ విధానంలోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
