కైలాసగుట్టపై రెండు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు

1001374645.jpg

కల్వకుర్తి: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆధ్యాత్మిక క్షేత్రం కైలాసగుట్టపై భక్తుల సౌకర్యార్థం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తన సొంత నిధులతో రెండు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో గుట్టపైకి వచ్చే భక్తులకు వెలుతురు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కైలాసగుట్ట అభివృద్ధికి భవిష్యత్తులోనూ తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.హైమాస్ట్ లైట్ల ఏర్పాటుపై కమిటీ సభ్యులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురం శేఖర్ రెడ్డి, బావాండ్ల మధు, సూరం తిరుపతిరెడ్డి, రఘు యాదవ్ స్వామి, కుడుముల శేఖర్ రెడ్డి, సాదు మురళీధర్ రెడ్డి, సురేష్ గౌడ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...