ఎంబీబీఎస్ విద్యార్థిని సౌమ్యకు గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.25 వేల ఆర్థిక సాయం.!
- వెల్దండ సర్పంచుకు సీఐ నర్సింహులు ఆత్మీయ సత్కారం.! - November 15, 2026
- కల్వకుర్తిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై ప్రతిపక్ష సర్పంచ్ల అభ్యంతరం.! - November 15, 2026
- అక్షరాల రూపంలో జీవిత ఆటుపోట్లు.. ‘ఆటుపోట్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుంకిరెడ్డి! - November 15, 2026

కల్వకుర్తి నవంబర్ 15: కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన వాటం శ్రీశైలం కుమార్తె సౌమ్య ఎంబీబీఎస్ సీటు సాధించడంతో, ఆమె చదువుకు అండగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థిని కుటుంబ సభ్యులకు స్టడీ మెటీరియల్ కొనుగోలు నిమిత్తం ఈ మొత్తాన్ని అందజేశారు. రాబోయే మూడేళ్ల పాటు కూడా స్టడీ మెటీరియల్ ఖర్చులను భరిస్తామని గోలి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చినట్లు విజయ్ గౌడ్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సురేష్ గౌడ్, రుక్సుద్దీన్, వీరాస్వామి, భానుచందర్, మాణిక్యం, పరమేష్, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు.
