అసంపూర్తి గృహ నిర్మాణాలను ఆదుకున్న ఉప్పల ట్రస్ట్ అధినేత

కల్వకుర్తి : కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామానికి చెందిన కాటన్ మిల్లు కార్మికురాలు నిర్మలా ఇంటి నిర్మాణం ఆర్థిక ఇబ్బందుల వల్ల మద్యలో నిలిచిపోయింది.ఈ విషయాన్ని కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్య ప్రకాష్ రావు ద్వారా తెలుసుకుని ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో నిర్మలా ఇంటికి సిమెంటును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 1001215472.jpg

బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, కార్మిక సంఘం నాయకులు వెంకటేష్,వెంకటయ్య,బాలస్వామి, చందు ,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...