మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థీక సహాయం
- సర్కారీ బడుల్లో విస్తృత తనిఖీలు - August 11, 2026
- ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి - August 11, 2026
- సాన్జోస్లో క్వాంటమ్స్కేప్ సీఈఓతో భేటీ - August 11, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 11: కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో వావిల్ల లక్ష్మమ్మ మంగళవారం అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ, ఉప్పల టీమ్ సబ్యుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.3 వేల రూపాయలు సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప్పల టీమ్ సబ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనిల్ దాదమోని ,వార్డు సభ్యులు మద్దెల వెంకటయ్య , సెట్టిపల్లి లోకేశ్వర్, ఆరేకంటి పరమేశ్వర్, ఎముకంటి వెంకటయ్య ,మహేష్, రామస్వామి, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
