రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం భిక్నూర్ గ్రామంలో *రూ.10 లక్షల వ్యయంతో* నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘం (SHG) భవనాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రారంభించారు. గతంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమకు ప్రత్యేక భవనం అవసరమని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని కలిసి విజ్ఞప్తి చేశారు. మహిళా సంఘాల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు నూతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు భిక్నూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు కేటాయించగా, భవన నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తమ విజ్ఞప్తికి స్పందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భవనం మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, సంఘ కార్యకలాపాలను సమర్థవంతంగా కొనసాగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడనుంది. మహిళల ఆర్థిక అభివృద్ధికి, స్వావలంబనకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళా సంఘాల విజ్ఞప్తికి స్పందించి, ఇచ్చిన హామీని నెరవేర్చి భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.