ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు

వెల్దండ: సర్కూర్ గ్రామం లోని శ్రీశ్రీ శివాలయ ఆంజనేయ స్వామి దేవాలయాల నిర్మాణానికి మండేగుత్తల విజయ్ కుమార్, భద్రప్ప, శివలింగం (దివంగత చెన్న బసప్ప కుమారులు) రూ.1,00,116 విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గోలి గోవర్ధన్ రెడ్డి, గోలి విష్ణువర్ధన్ రెడ్డి, అల్లె సందీప్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాతలకు గ్రామస్థులు, దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులతో దాతలు, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.1001262505.jpg

You may also like...