కిస్మాత్పూర్ డివిజన్ 122 పరిధిలోని కాళికా నగర్ కాలనీలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

323442.jpg

ఉత్సవాల్లో భాగంగా కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో 122 డివిజన్ ప్రెసిడెంట్ దొంత్రుమోని ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో అమ్మవారి కృపాకటాక్షాలు అందరికీ కలగాలని ఆయన ఆకాంక్షించారు. నిత్య పూజలు, అర్చనలతో కాళికా నగర్ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

You may also like...