సంవిధాన్ రక్షా మార్చ్‌కు తరలిరావాలి: తోటకూర వజ్రేష్ యాదవ్

 మేడ్చల్–మల్కాజిగిరి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవంబర్ 26న హైదరాబాద్‌లోని లిబర్టీ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించే సంవిధాన్ రక్షా మార్చ్‌కు ప్రతి డివిజన్ నుంచి 100 మంది తరలిరావాలని వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి డివిజన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలని, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, బండి రమేష్, కూన శ్రీశైలం గౌడ్, కొలను హనుమంత్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లా డివిజన్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

You may also like...