రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా 280వ వారం అంబేద్కర్‌కు జ్ఞాన పూలమాల


హైదరాబాద్‌: భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న జ్ఞాన పూలమాల కార్యక్రమం 280వ వారానికి చేరుకుంది. టీజీఎస్‌ఆర్టీసీ రాణిగంజ్ డిపోలో నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రిప్లై, ఏడీసీ శ్రీకాంత్, చంద్రమౌళి, జీవన్, శ్రామిక్, కె. రవీందర్, మేకల రాజేందర్, మంత్రి కృష్ణ, సుద్దాల సురేష్, ఎం. గోపి తదితరులు పాల్గొన్నారు. బహుజన కార్మికుల ఐక్యతను చాటుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి వారం ఒక్కొక్కరికి పూలమాల వేసే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమ ప్రత్యేకత.

You may also like...