కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ బీమా వర్తించాలి

Hussain Kampally
 
జ్ఞాన తెలంగాణ /డిండి ప్రతినిధి: ఇందిరమ్మ బీమా పథకం ఇంటిలో ఒక్కరికే కాకుండా రేషన్ కార్డులో ఉన్నటువంటి  ప్రతి కుటుంబ సభ్యులకి వర్తించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కాంపల్లి హుస్సేన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ జీవిత బీమా పథకం రేషన్ కార్డులో ఉన్నటువంటి వారిలో ఒకరికే కాకుండా రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ బీమా పథకం వర్తింపజేయాలి, మనిషి చనిపోతే వచ్చే పథకాలు కాకుండా మనిషి బ్రతికున్నప్పుడు కూడా వారి సమస్యలను పట్టించుకోని హెల్త్ పరంగా 10 లక్షల వరకు హెల్త్ కార్డులు జారి చేయాలి.

You may also like...