రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) మేడ్చల్: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో బ్లాక్, డివిజన్, మున్సిపల్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్చార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా, బ్లాక్, డివిజన్, మున్సిపల్ స్థాయి నాయకులు, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
