రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
జ్ఞాన తెలంగాణ: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు డాక్టర్ ఆనంద్ రావు బహుమతులు అందజేసి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి, రెండో, మూడో బహుమతులను అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పలువురు పేర్కొన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేసిన డాక్టర్ ఆనంద్ రావును ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ రావుతో పాటు గజానంద్, సాయి కర్ణ జాదవ్, కండేరావు, మిలింద్, ప్రశాంత్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.