గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల అనారోగ్యంపై విచారణ జరిపించాలి
- సర్పంచ్‌పై కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు.. రూ.30 వేల పన్ను సొమ్ము దుర్వినియోగంపై విచారణకు ఆదేశాలు - November 23, 2026
- ధాన్యం తరలింపులో అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డెక్కిన రైతు! - November 23, 2026
- గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల అనారోగ్యంపై విచారణ జరిపించాలి - November 23, 2026
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు అందించే ఆహారంలో కప్ప పడిన ఘటనపై తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సుధాకర్, ప్రధాన కార్యదర్శి దుబ్బాక శంకర్ మాట్లాడుతూ.. పాఠశాలలో కూరలో కప్ప పడటంతో పలువురు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయని తెలిపారు. ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపల్ చైతన్య, వైస్ ప్రిన్సిపల్ మీనాక్షిని ప్రశ్నించగా ఘటన వాస్తవమేనని అంగీకరించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రిన్సిపల్ చైతన్య, వైస్ ప్రిన్సిపల్ మీనాక్షిని దోమకొండ పాఠశాల నుంచి ఇతర పాఠశాలకు బదిలీ చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడ్వైజర్ లింగం, కమిటీ సభ్యులు లలిత, చంద్రశేఖర్, కర్ణ శ్రీకాంత్, సుధా తదితరులు పాల్గొన్నారు.

