సీనియర్ స్వేరో నాయకుడు ఇనపనూరి ఆదాం మృతి.. ఖమ్మం స్వేరోస్ ఘన నివాళి
- విదేశీ ఉద్యోగాలకు భారీ సబ్సిడీ - November 27, 2026
- ఉత్తరప్రదేశ్లో బహుజన సాధికారతకు స్వేరోస్ పిలుపు - November 27, 2026
- ఉత్తరప్రదేశ్ పర్యటన ముగించి హైదరాబాద్కు ఆర్ఎస్పి - November 27, 2026

జ్ఞానతెలంగాణ,ఖమ్మం వెబ్ డెస్క్:: సీనియర్ స్వేరో నాయకులు ఇనపనూరి ఆదాం ఆకస్మిక మరణం స్వేరోస్ ఉద్యమ వర్గాల్లో విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల ఖమ్మం జిల్లా స్వేరోస్ బృందం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళులర్పించింది. మరణవార్త తెలిసిన వెంటనే జిల్లా స్వేరోస్ నాయకులు ఆదాం నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆదాం స్వేరోస్ ఉద్యమంలో అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన మృతి ఉద్యమానికి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సుప్రీమ్ స్వేరోస్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఫోన్ ద్వారా ఇనపనూరి ఆదాం కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించారు. ఆదాం మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో అధైర్యపడవద్దని, స్వేరోస్ నెట్వర్క్ కుటుంబం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆదాం కుటుంబానికి అవసరమైన సమయంలో స్వేరోస్ బృందం తోడుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
పరామర్శ కార్యక్రమంలో జిల్లా స్వేరోస్ అధ్యక్షులు కొండ్రు రామచంద్రు, జిల్లా ప్రధాన కార్యదర్శి సోంపొంగు శ్యామ్ సుందర్, భద్రాద్రి జోన్ మాజీ అధ్యక్షులు బండ్ల నాగేశ్వరరావు, మాజీ జిల్లా అధ్యక్షులు గద్దల నాగరాజు, మాజీ గౌరవ స్వేరో అధ్యక్షులు మందుల వెంకన్న, శీలం ప్రసాద్, భాస్కర్, బొబ్బిలి భరత్ చంద్ర, మందుల రమేష్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఆదాం సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.
