పిట్లం–బాన్సువాడ మార్గంలో బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు!

పిట్లం నుంచి బాన్సువాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులు సమయానికి నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. నిర్ణీత సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో జాప్యం జరుగుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా అత్యవసర పనులపై వెళ్లేవారు, రోజువారీ ప్రయాణాలు చేసేవారు బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. పిట్లం–బాన్సువాడ మార్గంలో బస్సుల రాకపోకలపై ఆర్టీసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను సమయపాలనతో నడిపించి, అదనపు సర్వీసులు అవసరమైన వేళ అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

You may also like...