ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం

MANKALI NAGESH
చిన్నకో మండలంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుడిసె లక్ష్మయ్య, పంపరి కనకయ్య జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిద్దిపేట జిల్లా ఫిషర్‌మెన్ ప్రధాన కార్యదర్శి గుండు వెంకటేష్,రాష్ట్ర మాస్ ప్రచార కార్యదర్శి ప్రభు రాజ్ గంగపుత్ర , పూలమాలలు వేసి గంగపుత్రులకు ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గంగపుత్రులు ధైర్యసాహసాలకు మారుపేరని కొనియాడారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ చేపల వేటను వృత్తిగా కొనసాగిస్తూ సమాజానికి సేవలందిస్తున్న గొప్ప వృత్తిదారులు మత్స్యకారులని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం డైరెక్టర్లు, సలహాదారులు, సభ్యులు, సంఘం నాయకులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...