లింగంపేట్ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా గాదం సాయిలు నియామకం

లింగంపేట్: ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు లింగంపేట్ మండలంలోని మోతె గ్రామానికి చెందిన గాదం సాయిలును లింగంపేట్ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు పోకల సాయిరాం తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన నాయకులకు గాదం సాయిలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బ్యాగరి సాయిలు, జిల్లా యువజన అధ్యక్షుడు జైల్ సింగ్, మండల యువజన అధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు శ్రీకాంత్, బుర్ర కృష్ణ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు సావిత్రి, మండల ఉపాధ్యక్షుడు మహేందర్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సాయిలు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...