దివ్యాంగుడి విజ్ఞప్తికి కలెక్టర్‌ స్పందన.

జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,అక్టోబర్ 09:


బిచ్కుంద మండలానికి చెందిన దివ్యాంగుడు గండ మల్లా గంగాధర్ ప్రజావాణిలో చేసిన విజ్ఞప్తికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సానుకూలంగా స్పందించారు. తన రోజువారీ అవసరాలు, జీవనోపాధి కోసం బ్యాటరీ వాహనం అందించాలని గంగాధర్ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ను కోరారు.దివ్యాంగుడి పరిస్థితిని సానుభూతితో పరిశీలించిన కలెక్టర్, వెంటనే స్పందించి మరుసటి రోజే గంగాధర్‌ను కలెక్టరేట్‌కు పిలిపించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ సమీపంలో గంగాధర్‌కు బ్యాటరీ వీల్‌చైర్‌ను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజలు తెలిపే సమస్యలను సానుభూతితో పరిశీలించి, అర్హులైన వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ సహాయం అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి, డీడబ్ల్యూఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...