రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
బాన్సువాడ: బాన్సువాడ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగ సంఘాల ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. వివిధ కార్మిక సంఘాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఎంప్లాయిస్ యూనియన్, టీఎస్డబ్ల్యూయూ, ఐఎన్టీయూసీ, ఎస్‌డబ్ల్యూఎఫ్, బీఎంఎస్, టీఎంయూ తదితర యూనియన్లు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఉదయం నుంచే డిపోలో ఎన్నికల సందడి నెలకొనగా, ఉద్యోగులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి ఓట్లు వేస్తున్నారు.
పోలింగ్ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఈ నెల 17వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఎన్నికల్లో తమ యూనియన్‌కు మద్దతుగా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కౌంటింగ్ అనంతరం ఏ యూనియన్ విజయం సాధిస్తుందోనన్న ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది.