రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ ప్రతిభ
- సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు - October 9, 2026
- సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌కు వీధి వ్యాపారుల నుంచి విశేష స్పందన - October 9, 2026
- హైదరాబాద్ రవీంద్రభారతిలో 6TV రిపోర్టర్ కు ఘన సత్కారం - October 9, 2026

జనగామ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శివగారి కిరణ్ కుమార్ రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌లో భాగంగా లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో పురుషుల 93 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రథమ, పవర్ లిఫ్టింగ్‌లో ద్వితీయ స్థానం సాధించారు. క్లీన్ అండ్ జర్క్‌లో 50 కిలోలు ఎత్తగా, పవర్ లిఫ్టింగ్‌లో డెడ్‌లిఫ్ట్‌లో 140, స్క్వాట్స్‌లో 135, చెస్ట్ ప్రెస్‌లో 60 కిలోలు ఎత్తారు. కేవలం 2.5 కిలోల తేడాతో ప్రథమ స్థానం కోల్పోయారు. తన విజయానికి సహకరించిన అధికారులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు, జిమ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
