జనగామ మున్సిపల్ కౌన్సిల్‌లో 19 అంశాలకు ఆమోదం 15 అంశాలు వాయిదా

1000203915.jpg

జనగామ పురపాలక సంఘం 8వ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్‌లో చైర్‌పర్సన్ కడకంచి బాలమణి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో మొత్తం 34 ఎజెండా అంశాలను ప్రవేశపెట్టగా, కౌన్సిల్ 19 అంశాలకు ఆమోదం తెలిపింది. మరో 15 అంశాలను వాయిదా వేసినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై కౌన్సిల్‌లో చర్చించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ రాజశేఖర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

You may also like...