రేషన్ డీలర్ల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి

రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర కోశాధికారి, జనగామ జిల్లా అధ్యక్షుడు దుగ్గంపూడి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్లకు రూ.300 కమిషన్‌తో పాటు గౌరవ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేసి రేషన్ డీలర్లకు న్యాయం చేయాలని కోరారు.

You may also like...